ధర్పల్లి మండల కేంద్రంలో అయ్యప్ప సామూహిక మహా పడిపూజ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రం, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్.ఆర్.భూపతిరెడ్డి పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు.

పూజ కార్యక్రమంలో వందలాది అయ్యప్ప భక్తులు పాల్గొని పవిత్ర అనుభవాన్ని పొందారు. ఉదయం 10 గంటలకు నవవిధ అభిషేకాలు, ఒంటిగంటకు పదునెట్టంబడి పూజ, మరియు మధ్యాహ్నం రెండు గంటలకు మహా బిక్ష ప్రసాదం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ధర్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, గురు స్వాములు రామ్ రెడ్డి, గడ్డం తిరుపతిరెడ్డి, నూకల గంగాధర్, అంకం ఆనంద్, మరియు ఇతరులు పాల్గొన్నారు.

అయ్యప్ప మాల స్వాముల కృపతో, ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment