|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, గోవింద్ పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడినాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని, ఆలయ పూజల్లో భాగంగా కుంకుమార్చనను విజయవంతంగా నిర్వహించినట్లు ఆలయం కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గొల్ల రాజగణేష్, కర్రోల్ల శ్రీనివాస్, దొడ్డెనుక రాజేందర్, సంబేటి పెద్ద నర్సయ్య, ఒడ్డేటి జలంధర్, చెరుకు నడిపి గంగారాం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల మధ్య సాంస్కృతిక అనుబంధాలు పెరిగాయని, దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు సరికొత్తగా ప్రదర్శించబడినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.










