ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: మార్చ్ 5 నుంచి 23 వరకు పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ ||

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, మెదక్ జిల్లాలో మొత్తం 30 పరీక్ష సెంటర్లలో 6238 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

ఈ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరీక్షలు పకడ్బందీగా జరుగడానికి అవసరమైన చర్యల గురించి అధికారులతో చర్చించబడ్డాయి.

ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, పరీక్ష కేంద్రాల్లో అనుమతించరాదని.

విద్యార్థుల కోసం తాగునీరు, మూత్రశాల సౌకర్యాలు, మరియు పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేయాలని,

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్ నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని,

పరీక్ష పేపర్లను పోలీస్ ఎస్కార్ట్ తో ప్రభుత్వ వాహనాల్లో తరలించాలని,

ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలని, బస్సుల సౌకర్యం కల్పించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment