ధర్పల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా మామిడి కళ్యాణి – ఒక్కరోజు వ్యవధిలో సిరికొండ నుండి ధర్పల్లికి మార్పు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా మామిడి కళ్యాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఆదివారం సిరికొండలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఆమె, రెండు రోజుల్లోనే ధర్పల్లికి బదిలీ కావడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఈ సందర్భంగా ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ, మండల పరిధిలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రతి నేరాన్ని కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. నేర నియంత్రణకు పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలందరూ పోలీస్ వ్యవస్థకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే చర్యలు సహించమని స్పష్టం చేశారు. మండల ప్రజల సమర్థ సహకారంతో న్యాయం మరియు శాంతి స్థాపన సాధ్యమవుతుందని కళ్యాణి ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment