|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ జింఖాన గ్రౌండ్ లో డిసెంబర్ 1న మాలల సింహ గర్జన భారీ సభకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ తమ ఇళ్లకు తాళం వేసి ఈ సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు,
ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపితే పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు ఆలుక కిషన్, జె.ఏ.సి అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్, కో కన్వీనర్లు వెంకటేశ్వర్లు, నాగరాజు, పెర్క రామకృష్ణ, సంజు, డిస్కో సాయిలు, మరియు మలమహనాడు సోదరులు పాల్గొన్నారు.
ఈ సమావేశం విజయవంతం చేయడానికి ప్రజల నుండి భారీ మద్దతు కావాలని చెన్నయ్య ఆకాంక్షించారు.








