|| దృశ్యం న్యూస్ ||
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతులు మీదుగా రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ, యుఎస్ఎఫ్ఐ 1984 లో ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పడింది అని, విద్యార్థుల హక్కులు, రాజకీయ, సామాజిక అంశాలపై అనేక పోరాటాలు చేపట్టింది అని తెలిపారు.
అదేవిధంగా అఖిల భారత మహాసభలు డిసెంబర్ 14, 15 తేదీలలో విజయవాడలో నిర్వహించబడతాయి. ఈ మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యచరణపై చర్చలు జరిపే అవకాశం ఉంటుంది అని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ,

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడం, తదితర విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లాలని రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టు జిల్లా నేతలు తెలిపారు.
ఈ విషయమై స్పందించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేణుగోపాల్, మారుతి, విష్ణు, విశాల్, భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.








