|| దృశ్యం న్యూస్ ||
శనివారం రోజున శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జాతరను ఉత్సాహంగా నిర్వహిస్తామని, ఉదయం పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయని, ఆలయ సందర్శనకు ధర్పల్లి గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారాని తెలిపారు.

ఈ సంవత్సరం స్వామి కళ్యాణ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని, దేవుని ఆశీర్వాదంతో ఎన్నికల ప్రచారం ఇక్కడి నుండే ప్రారంభించి ప్రజల ఆదరణతో గెలిచానని తెలిపారు.
ఆలయ పునర్నిర్మాణానికి మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఐదు లక్షల రూపాయల చందా ఇచ్చారని, తాను కూడా 51 వేల రూపాయల చందా ఇస్తానని, దేవాదాయశాఖ ద్వారా ఆలయ అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు ఇచ్చేలా చూస్తానని వెల్లడించారు.
అనంతరం, నడిమి తండాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి, రైతుల పంటల కోసం నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండాలని దేవుడిని ప్రార్ధించనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్,లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ నాయకులు చెలిమెల శ్రీనివాస్, చెలిమెల నర్సయ్య,మిట్టపల్లి గంగారెడ్డి,నడిమి తండా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








