|| దృశ్యం న్యూస్ ||
జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం ఈనెల 8వ తేదీన మెదక్ జిల్లా అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది.
సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజీమార్గమే రాచమార్గము అనే సదుద్దేశ్యంతో కక్షిదారులకు త్వరిత సమ్మతమైన న్యాయం అందించే ఈ లోక్ అదాలత్ ప్రాధాన్యమై ఉంది.
ఈ నెల 1వ తేదీ నుంచి, మెదక్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కక్షిదారుల సౌకర్యార్థం వివిధ న్యాయస్థానాలలో లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసింది. వివాహ, చెక్ బౌన్స్, భూమి, డబ్బు తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు తదితర వివాదాలకు పరిష్కారంగా లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది అని తెలిపారు.
ప్రిలిటిగేషన్ సెటిల్మెంట్ ద్వారా కూడా కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు, లోక్ అదాలత్‌లో కేసులు త్వరగా పరిష్కరించి కోర్టు ఫీజు కూడా తిరిగి పొందవచ్చు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మెదక్ జిల్లా ప్రజలు శాంతి, సామరస్య వాతావరణంలో జీవించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కోరింది.








