అక్రమ భూమి సమస్యపై ఆదేశాలు జారీ చేసిన సబ్ కలెక్టర్ : వెంటనే స్పందించిన స్థానిక అధికారులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా రుద్రుర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమి పై కొందరు అక్రమణ చేయడానికి ప్రయత్నిస్తూ లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేయడంతో బాధితులు మండల కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు బోధన్ సబ్ కలెక్టర్ ను ఆశ్రయించారు.

సబ్ కలెక్టర్ ఈ అంశంపై తక్షణ చర్య తీసుకోవాలని ఆర్ఐ, సర్వేయర్, తాసిల్దార్, అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడంతో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని డిజిటల్ సర్వే నిర్వహించి స్థానిక బాధితుల వద్ద సమగ్ర పరిశీలన చేసి కొలతలు తీసుకుని వివరాలు సేకరించారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే కానీ స్థానిక అధికారులు స్పందించకపోవడం పై బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు.

త్వరలోనే బాధితులకు న్యాయం చేయడంలో చర్యలు తీసుకుంటాం అని ఎమ్మార్వో తారాబాయి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment