|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్నమావుంది గ్రామం నుండి కుంటాల సోమన్న, నెంబర్ 10 వారి శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి దిండి పాదయాత్ర బుధవారం రోజున పూజారి మల్లికార్జున్ అప్ప, రాచప్ప మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కుంటాల సోమన్న దిండి పెద్దమావుంది మీదుగా బండారుపల్లి చేరుకుంది. అనంతరం అక్కడినుండి సాలూరా మీదుగా అహ్మద్పూర్ చేరుకొని అక్కడి నుండి భక్తులు భజనలు కీర్తనలతో పాదయాత్రగా బయలుదేరుతారు. మన్మథ స్వామి పాదయాత్రలో అతిపెద్దది, పురాతమైనటువంటిది ఈ దిండి. ఈ దిండిలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని పౌర్ణమి నాటికి బీడ్ జిల్లాలోని మాంజర్ సోంబ గ్రామ శ్రీ క్షేత్ర కపిలధార లో గల మన్మథ స్వామి ఆలయంలో గల దివ్య జీత్త స్మారకాన్ని దర్శించుకోవడం తో యాత్ర ముగుస్తుంది. నేడు భక్తులకు అన్నదానం పెద్దమావుంది మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి, పోతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు రాజప్ప, శంకరప్ప, నాగనాథ్ పటేల్ శ్రీరామ్ ధర్మయ్య పాల్గొనడం జరిగింది.








