రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్రలో పాల్గొన్న కొట్నక్ తిరుపతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ & బాన్సువాడ నియోజకవర్గ జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కోఆర్డినేటర్ కొట్నక్ తిరుపతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఏడాది పాటు ప్రతి గ్రామాన్ని సందర్శించేలా పాదయాత్ర చేపట్టామని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ పాదయాత్ర జరుగుతుందని, ప్రతి రోజు ఉదయం రెండు గ్రామాలు, సాయంత్రం రెండు గ్రామాలలో రాజ్యాంగ విలువలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వర్ని మండల కోఆర్డినేటర్ గంగా శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, మహమ్మద్ భారీ, కృష్ణారెడ్డి, కలాల్ గిరి, భాను, పిట్ల సాయిలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment