|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాకు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంతో మెదక్ నియోజకవర్గంలో బీజేపీ శక్తి పెరుగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా కరణం పరిణిత పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ నియామకం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది.








