బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు – కాంగ్రెస్ పార్టీ వీడి గులాబీ పార్టీకి జేజేలు తెలిపిన నేతలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ మండల నాయకుల చేరికలతో రాజకీయ వాతావరణంలో వేడి పెరిగింది. సల్పబండ తండా మాజీ సర్పంచ్ బాదావత్ శర్మ నాయక్, మాజీ ఉప సర్పంచ్ వేముల పెద్దిరెడ్డి, విడిసి సభ్యులు రామావత్ మోతిలాల్ నాయక్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మరియు టీఆర్ఎస్ నేత వీజీ గౌడ్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్‌లోకి అధికారికంగా చేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జగన్, మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, రాజ్ పాల్ రెడ్డి, బాదావత్ శంకర్ నాయక్ తదితర గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ చేరికలు ధర్పల్లిలో టీఆర్ఎస్ బలం మరింత పెరిగేలా చేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment