|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడు మల్లవరపు జోన్స్ విద్యార్థులకు అందించే విద్యతో పాటు పాఠశాల యొక్క పరిసరాలను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో నిండి ఉంటే విద్యాబ్యాసానికి మంచి వాతావరణం ఏర్పడుతుంది అని ఆయన అభిప్రాయపడుతున్నారు.
పాఠశాల అభివృద్ధి కోసం ప్రణాళిక :

ప్రధానోపాధ్యాయుడు మల్లవరపు జోన్స్ పాఠశాల బాధ్యతలు తీసుకునే సమయానికి పాఠశాలలో గందరగోళ వాతావరణం మరియు పిచ్చి మొక్కలు ఆయన మనస్సును కలచివేసాయని, ఈ పాఠశాల నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారి పక్కన ఉంది కాబట్టి, దీనికి మెరుగైన విధానాలు అవసరమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు మరియు సంబంధిత అధికారుల సహకారంతో పాఠశాల అభివృద్ధి కోసం ఆయన అనేక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
పాఠశాలలో పచ్చదనాన్ని ప్రోత్సహించడం :

ఈ పాఠశాలను అందంగా తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా, వివిధ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని ప్రోత్సహిస్తు పాఠశాల గోడలపై స్వతంత్ర సమరయోధుల మరియు దేశ ప్రముఖుల చిత్రాలు పెయింటింగ్ వేయించడం జరిగిందని, ఈ సందర్భంగా విద్యార్థులకు స్ఫూర్తి కలిగించడంతో పాటు, పాఠశాల సౌందర్యాన్ని కూడా పెంచుతోంది తెలుపుతూ,
ఈ కార్యక్రమాల కోసం ఉపాధ్యాయుల సహకారంతో దాదాపు 3 లక్షల రూపాయలు స్వతహాగా ఖర్చు చేసామని తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో సంభాషణలు :

విద్యార్థుల తల్లిదండ్రులతో నెలవారి సమీక్ష సమావేశాలను నిర్వహించడం ద్వారా, వారి అభిప్రాయాలు, సలహాలు సేకరించడంతో పాటు, విద్యార్థుల చదువులో ప్రగతిని ప్రోత్సహిస్తు, ఈ సమీక్షల ద్వారా విద్యార్థులకు చదువులో ఎదుగుదలలో ప్రాముఖ్యతను అందించడం జరుగుతోంది అని తెలియచేస్తూ,
గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జానకంపేట్ గ్రామ పాఠశాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచింది అని, మొత్తం 98% ఉతిర్ణత నమోదు అయింది అని, ఈ క్రమంలో ఒక విద్యార్థిని కూడా మండల మొదటి ర్యాంక్ సాధించడం, ఇంగ్లీష్ మీడియంలో కూడా 10/10 ఉతిర్ణత సాధించడం జరిగింది అని తెలుపుతూ ఇది పాఠశాల యొక్క ఉపాధ్యాయుల కృషిని స్పష్టంగా తెలియజేస్తోంది అని తెలిపారు.
సమస్యలు మరియు పరిష్కారాలు :

పాఠశాలలో మరికొన్ని సమస్యలు ఉన్నాయనీ, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల సహకారం ఉంటే ఈ సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయని, గ్రామ పెద్దలు కూడా ఈ విషయంలో సహకరించాలని జోన్స్ అభిలషిస్తున్నారు.
విద్యార్థుల పట్ల తన ప్రీతిని వ్యక్తం చేస్తూ, పాఠశాలను మెరుగుపరచడానికి మరియు విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి కృషి చేస్తూనే ఉంటామని. ఈ పాఠశాలలో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, గ్రామస్థుల సహకారం ఉంటే, విద్యార్థుల అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, విద్యార్ధులు ఇలాంటి ప్రేరణలతో మంచి వాతావరణం ఆస్వాదిస్తూ, తమ లక్ష్యాలను చేరుకోవడం, మంచి స్నేహితులు, ఉత్తమ విద్యా విధానం వైపు అడుగులు వెయ్యడం సాధ్యమవుతుంది అని, ఈ పాఠశాల విద్యార్ధుల ప్రగతి ద్వారా స్ఫూర్తి పొందుతూ, భవిష్యత్తు తరాలను పాఠశాల మరింత అభివృద్ధితో మరింత మంచి వాతావరణంతో స్వాగతం పలుకుతుందని జోన్స్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా ఈ మార్పులు, అభివృద్ధి మరియు విజయాలే విద్యార్థుల జీవితాలను మార్చడానికి ఉపయోగపడతాయని నమ్మకం ఉన్నట్లు తెలిపారు.








