చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాదు సచివాలయం నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ పీ. గోపి తదితర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సాగునీటి సరఫరా లోపం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టు కింద సాగు చేసే రైతులకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, చివరి ఆయకట్టుకు కూడా నీరు అందేలా చూడాలని అన్నారు.

జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, నీటి వినియోగం పర్యవేక్షించాలని సూచించారు. కాలువలు పరిశీలించి నీటి వృధా తగ్గించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఏఓ వినయ్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment