బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపుల దరఖాస్తుల ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 18 వైన్స్ షాపులకు సంబంధించిన లైసెన్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ డి. భాస్కర్ రావు తెలిపారు.

అదేవిధంగా ఈ దరఖాస్తులలో SC వర్గానికి 2 షాపులు (బోధన్-1, కోటాగిరి-1) మరియు గౌడల వర్గానికి 1 షాప్ (శాటాపూర్) రిజర్వ్ చేయబడినట్లు తెలిపారు.
దరఖాస్తుదారులు ₹3 లక్షల నాన్ రిఫండబుల్ చలానా లేదా డీ.డీతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలి అని, దరఖాస్తు ఫారమ్‌లను సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 18 వరకు నిజామాబాద్ DPEO కార్యాలయంలో ఆఫీస్ సమయంలో స్వీకరించబడతాయి అని, లక్కీ డ్రా అక్టోబర్ 23న నిర్వహించబడనుంది. ఎంపికైన దుకాణాలు డిసెంబర్ 1, 2025 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి అని ఎక్సైజ్ సీఐ డి. భాస్కర్ రావు తెలిపారు.

దరఖాస్తుల కోసం :
1️⃣ దరఖాస్తు ఫారమ్
2️⃣ ₹3 లక్షల చలానా/డీ.డీ ఒరిజినల్
3️⃣ మూడు ఫోటోలు
4️⃣ ఆధార్, పాన్ కార్డు జిరాక్స్
5️⃣ కాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైతే)
వంటి అవసరమైన పత్రాలతో DPEO కార్యాలయంలో సంప్రదించాలి అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment