విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ: కార్మిక హక్కుల కోసం కొత్త దిశ.

|| దృశ్యం న్యూస్ ||

హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 20న జరగనున్న విలీన సభ ప్రచార పోస్టర్లను నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, టి.యు.సి.ఐ లో ఐ.ఎఫ్.టీ.యు ను విలీనం చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ,
ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు, కార్మికుల జీవితాలను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతుందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బలమైన కార్మిక ఉద్యమం అవసరమని చెప్పారు, 14 రాష్ట్రాలలో కార్మికుల కోసం పోరాటం చేస్తున్న టి.యు.సి.ఐ లో ఐ.ఎఫ్.టీ.యు విలీనమవుతున్నదని ప్రకటించారు.

రాష్ట్రంలో మరియు దేశంలో కార్మికుల హక్కుల కోసం కనీస వేతనాల అమలును, కార్మిక వ్యతిరేక, నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకు మరింత విప్లవ స్పూర్తితో పోరాటం చేయాలని తెలిపారు, ఢిల్లీలో ఇప్పటికే రెండు కార్మిక సంఘాల విలీనమయ్యాయన్నారు.
ఈ సభకు జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పుట్టి నడిపి నాగన్న, వద్దన్నా, షేక్ నసీర్, సిద్ధ పోశెట్టి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment