వర్ని : సత్యనారాయణపురంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.


గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ని మండల అభివృద్ధి అధికారి (MPDO) వెంకటేశ్వర్లు, MPO అధికారి మారుతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ మరియు మండల పరిషత్ మహిళలకు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా సాధికారితపై స్పష్టమైన సందేశాలు అందిస్తూ, సమాజంలో వారి ప్రాముఖ్యతను గుర్తు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment