|| దృశ్యం న్యూస్ ||
జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరం నుండి నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు.

పరీక్షల సజావుగా నిర్వహణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్స్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచడం, పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లను బీఐఈ అధికారిక లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
పరీక్షల సమయాల్లో 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేస్తామని, పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేస్తామని తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.








