ఖరీఫ్ వరి కోతలపై సమీక్ష: హార్వెస్టర్ యజమానులకు సూచనలు: జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, పొలం పూర్తిగా కోత దశకు చేరుకున్న తర్వాతే యంత్రాలు వినియోగించాలన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో హార్వెస్టర్ వాహనాల యజమానులతో ఖరీఫ్ వరి కోతలపై సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం వరి కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో హార్వెస్టర్ యజమానులు బ్లోయర్ ఆన్‌లో ఉంచి, 18-20 RPM మధ్య నడిపి, A2-B1 గేర్‌లో యంత్రాలను నిర్వహించాలని సూచించారు. ఈ విధంగా పాటిస్తే తేమ శాతం తగ్గి, నాణ్యమైన ధాన్యం లభించే అవకాశముందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు నేస్తం ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి తగిన సూచనలు అందించాలని ఆదేశించారు.

రైతులు ధాన్యం శుభ్రపరిచి మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. జిల్లాలో 496 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment