మెదక్‌లో పెట్రోల్ బంకుల తనిఖీలు – మౌలిక వసతులు తప్పనిసరి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ పట్టణంలోని పెట్రోల్ బంకులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాందాస్ చౌరస్తాలో ఉన్న యజ్ఞయ్య భారత్ పెట్రోలియం బంకును అదనపు అధికారులు నిసార్, నాగరాజుతో కలిసి పరిశీలించారు. పెట్రోల్ డీజిల్ స్టాక్ వివరాలను పరిశీలించిన అనంతరం యూపీఐ సేవలు అందుబాటులో లేకపోవడంతో వెంటనే వినియోగదారుల సౌకర్యార్థం యూపీఐ స్వైప్ సేవలను ప్రారంభించాలని సూచించారు.

నిత్యానందం మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, పార్కింగ్ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని బంకులపై జరిమానాలు విధించి, అవసరమైతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment