ఆపరేషన్ సింధూరం: ఉగ్రవాదులపై భారత్ సైన్యం ఘన విజయం.

|| దృశ్యం న్యూస్ ||

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపధ్యంలో, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరం దేశం పట్ల భక్తి, ధైర్యానికి నిదర్శనం అని, ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ స్వయంబు శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో భారత భద్రతా బలగాల విజయం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పహాల్గం ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి సుమారు 100 మంది ఉగ్రవాదులను అంతమొందించిందన్నారు. జేసీ మహ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలపై దాడులు భారత సైనిక శక్తికి నిదర్శనమని చెప్పారు.

పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్నా పాకిస్థాన్ పై మోదీ నేతృత్వంలో భారత్ త్రివిధ దళాలు సమర్థంగా స్పందిస్తున్నాయని చెప్పారు. ప్రజలు, కేంద్ర ప్రభుత్వం, సైన్యం ఐక్యంగా ఉన్నప్పుడు శత్రు దేశాలు ఎదిరించలేవని స్పష్టం చేశారు.

కొంతమంది అర్బన్ నక్సలైట్లు ఆపరేషన్‌ను విమర్శించడం బాధాకరమని, వారిపై దేశద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ఇస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment