ఎమ్మార్పీఎస్ నాయకుల నిరవధిక నిరసన దీక్ష – తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు.
గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా సమీపంలో జరిగిన ఈ నిరసనలో గ్రూప్ వర్గీకరణ చట్టబద్ధత లేకుండా ఫలితాలు విడుదలైనందుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వర్ని మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మేదరి శేఖర్, ఉపాధ్యక్షులు మొరుగు కాశీరాం, కార్యదర్శి అశోక్, మరియు కుల సంఘాల నాయకులు రవికుమార్, రాప గంగాధర్, సాయిలు, సిందగడి రవి, కోటయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment