|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రమునకు
15వ, మహా పాదయాత్ర కరపత్ర ఆవిష్కరణను గురువారం రోజున ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్, జిల్లా న్యాయస్థాన ఇంచార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
ఈ పాదయాత్ర శ్రీ 108 షఠస్థల బ్రహ్మల దివ్య మంగళ ఆశిస్తులతో, సిద్దేశ్వర్ మహారాజు సుంకిని, మల్లికార్జున అప్ప, సంతోష్ మహారాజ్ సారథ్యంలో, వీరశైవ జంగమ – లింగాయత్ సమాజ్ సౌజన్యంతో 2024 నవంబర్ 2 న శనివారం రోజున బోధన్ పట్టణ జంగంగల్లి లోని పురాణే (పౌడయ్య) మఠం నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రారంభమై కార్తీక పౌర్ణమి నాడు మన్మథ్ స్వామి వారి దీవ్య జీత్త స్మరకాన్ని దర్శించుకోనే వరకు సుమారు 15 రోజులపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల వేల సంఖ్యలో వీరశైవ భక్తులు పాల్గొని భజనలతో, కీర్తనలతో కొనసాగుతుందని

కావున ఇట్టి కార్యక్రమమునకు
బోధన్ పట్టణ, మండల మరియు గ్రామాల సమస్త వీరశైవ సమాజ్ సభ్యలందరు పాల్గోని ఈ యాత్రని దిగ్విజయం చేయాలని కోరారు.
ఇట్టి కార్యక్రమంలో వీరశైవ జంగమ సమాజ్ పట్టణ అధ్యక్షులు ఎం నర్సింగ్ అప్ప, ఉపాధ్యక్షులు పౌడయ్య రాజేందర్ కుమార్, లింగాయత్ సమాజ్ ప్రముఖులు యాదవ్ పటేల్, పురాణే అజయ్ కుమార్, పురాణే దిలీప్ కుమార్, ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










