సంగారెడ్డి: వెండికోల్ గ్రామంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ ||

సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని సిసి రోడ్లకు మంత్రి దామోదర్ రాజనర్సింహా 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు భూమి చేసి, కొబ్బరికాయ కొట్టి గ్రామంలో రోడ్డు పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నత్తి దశరథ, నాయకులు మల్లారెడ్డి, ఈశ్వర్ గౌడ్, లింగంపల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, పత్తి రాములు, వెండికోల్ గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ జైశ్రీరామ్ రెడ్డి, విఆర్ఓ మల్లారెడ్డి, రామచంద్రారెడ్డి, గ్రామ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామ పెద్దలు, యువకులు, యువజన సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సిసి రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామ అభివృద్ధికి ఊతమివ్వనున్నట్లు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment