ఇమ్రాన్ ప్రతాప్, షేక్ వహీద్ సమావేశం: నిజామాబాద్ మైనార్టీ ప్రగతికి కొత్త దిశలు.

|| దృశ్యం న్యూస్ ||

ఆల్ ఇండియా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ తో నిజామాబాద్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ వహీద్ ఢిల్లీలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు, ఈ సమావేశంలో నిజామాబాద్ లో జరుగుతున్న విభిన్న విషయాలపై, ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సమస్యలపై చర్చ జరిగింది తెలిపారు.

మైనార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఇది మైనార్టీ సమూహాలకు సంబంధించిన అంశాలను చర్చించడానికి మరియు సమర్థవంతమైన పరిష్కారాలను పొందడానికీ ఒక మంచి అవకాశంగా నిలిచిందాని, ఇరువురు రాబోయే కాలంలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు దీనివల్ల నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ అభివృద్ధికి కొత్త దిశలు వెలువడతాయనే నమ్మకం ఉందని షేక్ వహిద్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment