బోధన్ మండలంలో NAS పరీక్ష పై ముఖ్యమైన సమావేశం.

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ మండలంలోని ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డిప్యూటీ డీఈఓ ఆఫీస్ బోధన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఈ నెల 30 న జరిగే NAS (National Achievement Survey) పరీక్ష గురించి చర్చించబడింది.
ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో 3వ, 6వ, 9వ తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించబడనున్నది.

ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు NAS పరీక్ష పాఠశాలల్లో నిర్వహించాలని విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు మండల విద్యాధికారి నాగయ్య ఆదేశించారు.

Apaar ( Automated Permanent Academic Account Registry ) గుర్తింపు కార్డు జనరేట్ చేయడం U-DISE ( Unified District Information System for Education ) లో విద్యార్థుల వివరాలు సరి చేసుకోవడం కూడా ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సూర్యకుమార్, రత్నాకర్, ఆరిపోద్దిన్, బాలచంద్రన్, సిఆర్పిలు విజయ్, బాబు, యూసఫ్, శివానంద్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment