మెదక్ జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు – విద్యుత్తు సరఫరాకు ప్రత్యేక చర్యలు.

|| దృశ్యం న్యూస్ ||

వేసవి కాలంలో విద్యుత్తు వినియోగంలో పెరుగుదలతో ఏదైనా అంతరాయం కలగకుండా ఉండేందుకు విద్యుత్తు శాఖ సమర్థవంతమైన సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది.
విద్యుత్తు శాఖ మెదక్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ యు. బాలస్వామి నేతృత్వంలో జిల్లా విద్యుత్తు అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) శంకర్ ఆధ్వర్యంలో డీఈలు, ఏఈలు, ఏడీఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

రూ.2 కోట్లు వ్యయంతో పాతూరు సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు,
ర్యాలమడుగు సబ్‌స్టేషన్‌లో 3.5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రారంభం,
కొత్తగా మెదక్ పట్టణం, బాలానగర్‌లో విద్యుత్తు సబ్‌స్టేషన్లు ఏర్పాటు,
అదనపు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు, పీటీఆర్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని,
దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యుత్తు సామగ్రి స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మెదక్ జిల్లాలో విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారని బాలస్వామి స్పష్టం చేశారు. రైతులకు, వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది ముందుగా సిద్ధం కావాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment