మెదక్ జిల్లాలో 30,30(ఎ) పోలీసు యాక్ట్ అమలు – ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరిక.

||దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని, మార్చి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు చేయబడనున్నట్లు మెదక్ జిల్లా ఎస్.పి. డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు.

అదే విధంగా, ప్రజా ధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టరాదని హెచ్చరించారు.
ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ చర్యలను సమర్థించి, శాంతి భద్రతలకు సహకరించాలని, ప్రజల నుండి కూడా సహకారం ఉండాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment