ప్రజలను మోసం చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది : ధన్ పల్ సూర్యనారాయణ

|| దృశ్యం న్యూస్ ||

ఈ రోజు నిజామాబాద్ పట్టణ భాజపా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం BRS పార్టీ కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని అవమానంగా చరితార్థం చేసారని విమర్శించారు. 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా పేదలకి అందించకపోవడం, తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఆరోపించారు.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు మరియు వందల హామీలను ప్రజలకు ఇచ్చినప్పటికీ, 10 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్యారంటీలకు దిక్కు లేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చెప్పే “ఇందిరమ్మ ఇండ్లు” కేవలం మోసం అని చెప్పారు. నిజామాబాదు అర్బన్ లో నిర్మించిన ఇండ్ల స్థితి చాలా దయనీయంగా ఉందని, అసాంఘిక కార్యకలాపాల కోసం కట్టబడినట్టుగా ఉందని ఆరోపించారు.

అర్హులైన ప్రజలకు ఇళ్లు అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు, ప్రభుత్వానికి డిమాండ్లు ఇస్తూ, నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమత్తుకు వెంటనే నిధులు కేటాయించాలని, అర్హులైన వారి జాబితా ప్రజాక్షేత్రంలో ఎంపిక చేసి వారికి ఇళ్లు ఇవ్వాలని కోరారు.

రైతుల పరిస్థితి కూడా సంతోషకరంగా లేదని, 2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు పూర్తి చెయ్యలేదని, రైతు భరోసా పథకం, మరియు రైతుల కోసం ఇచ్చిన పలు హామీలు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేసారు.

అయితే, గత ప్రభుత్వంలాంటి మోసాలను, బలవంతమైన హామీలను ఇచ్చి కాలాన్ని గడుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను కొనసాగించాడనికి భారతీయ జనతా పార్టీ సిద్ధం అవుతుందని తెలిపారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాలని, మరియు నిజమైన అర్హులైన పేదలకు ఇళ్లు అందించాలని డిమాండ్ చేస్తు, కేసీఆర్ కి పట్టిన గతి నీకు పడుతుందని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై చేసే ఈ ఉద్యమంలో పెద్దఎత్తున ప్రజల మద్దతు అవసరమని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment