మెదక్ జిల్లా RTI అమలులో రాష్ట్రానికి ఆదర్శం – రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం.

|| దృశ్యం న్యూస్ ||

సమాచార హక్కు చట్టం (RTI Act) పరిధిలో దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించడంలో మెదక్ జిల్లా మరోసారి ప్రతిభను చాటుకుంది. గత 19 నెలల కాలంలో RTI దరఖాస్తుల పరిష్కారంలో సమర్థవంతమైన నిర్వహణ చూపినందుకు మెదక్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం లభించింది.

హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం జరిగిన సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ అవార్డును స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్, బెస్ట్ PIO, బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ RTI కేసెస్ వంటి ఏడు విభాగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలు ప్రదానం చేశారు.
మెదక్ జిల్లా RTI దరఖాస్తులను పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించడంలో ముందంజలో ఉంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తరచూ RTI వ్యవహారాలపై రివ్యూ నిర్వహిస్తూ, పౌరులు అడిగిన సమాచారాన్ని గడువు లోపల అందించే విధంగా అధికారులను ప్రోత్సహిస్తున్నారు.
జిల్లా అభివృద్ధి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న అధికారుల కృషికి ఇది ప్రతిఫలమని అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment