|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన రెంజర్ల పోశెట్టి కుటుంబం తీవ్ర అనారోగ్యంతో జీవన పోరాటం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోశెట్టి కుటుంబానికి గ్రామ మాజీ సర్పంచ్ మద్ది సాయిలు కుమారులు మద్ది అశోక్ సహోదరులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ₹10,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా వారితో పాటు గ్రామ పెద్దలు పాల్గొని కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబానికి మెరుగైన వైద్యం అందేందుకు అందరూ కలిసికట్టుగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బాధిత కుటుంబానికి సహాయం అందించాలని అనుకునే దాతలు 📞 జలగిరి సంజీవ్ – 90595 95825 సంప్రదించవచ్చు అని తెలిపారు.








