ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్ పరిశీలించారు. పెద్దచింతకుంట, రాంపూర్, ధర్మసాగర్, మాచవరం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇళ్ల పురోగతిని పరిశీలించి వివరాలు సేకరించారు.

అనంతరం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి, గౌతమ్ మాట్లాడుతూ మార్కౌట్ పనులు వందశాతం పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులకు వారం రోజులు గడువు ఇచ్చి ఆ తర్వాత ఇతర అర్హులకు కేటాయిస్తామని తెలిపారు.

ఇంజనీరింగ్, మున్సిపల్, గృహనిర్మాణ శాఖలు సమన్వయంతో పని చేయాలని, మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు లోన్ సదుపాయం కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంత ఇల్లు కల సాకారం అవుతుందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment