|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, హోలీ పండుగ ప్రేమ, సౌభ్రాతృత్వం, ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు. హోలీ రంగుల పండుగను సాంప్రదాయ పద్ధతిలో, సహజ రంగులతో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
హోలీ పండుగను కుటుంబ సభ్యులు, మిత్రులు, సమాజంతో కలిసి హర్షోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించేందుకు ఈ రంగుల పండుగ దోహదపడుతుందని పేర్కొన్నారు.








