|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ మండపంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (హెచ్ఐవి నివారణ) ప్రాజెక్ట్ కింద అడ్వకేసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాదవ్ కృష్ణ మాట్లాడుతూ మహిళా స్వచ్ఛ వర్కర్లు తమ వృత్తిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వృత్తి మార్చుకోవాలనుకునే వారికి మెప్మా ద్వారా వృత్తి శిక్షణ కల్పించి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. బోధన్ పాత బస్టాండ్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకుంటామని, త్వరలోనే ఆక్రమణలను తొలగిస్తామని కమిషనర్ హెచ్చరించారు.

గౌరవ అతిథిగా టౌన్ సీఐ వెంకట్ నారాయణ మాట్లాడుతూ ,
మహిళా సెక్స్ వర్కర్లు సత్ప్రవర్తనతో వృత్తి కొనసాగించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగితేనే పోలీసు జోక్యం ఉంటుందని, సెక్స్ వర్కర్ల పిల్లలు చదువులో లేదా వృత్తి శిక్షణలో సహాయం కావాలనుకుంటే స్నేహ సొసైటీను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్దయ్య, ఎస్ఐ భాస్కరాచారి, ఏఎస్ఐ, అబ్దుల్ నయీమ్, కౌన్సిలర్ అన్విత, జిఎన్ఎమ్ మౌనిక, అవుట్ రీచ్ వర్కర్లు, పీర్ ఎడ్యుకేటర్లు మరియు మహిళా సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు.








