మెదక్‌లో భారీ వర్షాలు – మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

రానున్న నాలుగు రోజుల పాటు మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మంజీరా, హల్దీ నదుల పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అనవసరంగా చెరువులు, వాగులు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.

పాపన్నపేట మండలం గణపురం ఆనకట్టను కలెక్టర్ అధికారులతో కలసి పరిశీలించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో అన్ని చర్యలు చేపట్టామన్నారు.

ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని, వాగులు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి పర్యవేక్షణ కొనసాగుతున్నదని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వర్షాకాలంలో నదులు వాగుల వద్ద జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment