మెదక్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. పటాకులు కాల్చేటప్పుడు అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పాల్గొనాలని కలెక్టర్ అన్నారు.

అదేవిధంగా దీపావళి సామాగ్రి అమ్మే షాపు యజమానులు అన్ని అనుమతులు తీసుకొని, సరసమైన ధరలకే అమ్మాలి అని సూచిస్తూ, పటాకులు కాల్చే ప్రదేశంలో నీరు, ఇసుక బకెట్లు లేదా తడి గుడ్డలు సిద్ధంగా ఉంచుకోవాలని, పత్తి దుస్తులు ధరించడం మంచిదని తెలిపారు.

ప్రభుత్వ అనుమతి పొందిన నాణ్యమైన, పర్యావరణహిత పటాకులను వినియోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నారు. అగ్నిప్రమాదం లేదా గాయాలు సంభవించినపుడు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 101 లేదా 8712699263 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment