|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ, హిందూ పండుగలలో ప్రతి ఒక్క పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుందని, ఇది హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. భారతదేశం మొత్తంలో చిన్న పెద్ద తేడా లేకుండా, కుల, మతాలకు అతీతంగా దీపావళి పండుగ జరుపుకుంటామని ఆయన తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలో దీపావళి పండుగను భక్తి, శ్రద్దలతో నిర్వహించడం అనవాయితీగా ఉన్నదని, మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం, నోములు నోచుకోవడం ఈ పండుగ యొక్క ముఖ్యమైన భాగమని వివరిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకుంటామని తెలిపారు.
దీపావళి పండుగ రోజున ప్రతి ఇల్లు శ్రీ లక్ష్మీ దేవి ఆశీస్సులతో వెలిగించబడుతుందని, ఈ దీపాల కాంతులు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరారు. అష్ట ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలు ఉండాలని ఆకాంక్షించారు.
అంతేకాక, ప్రజలు బాణాసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలా చేస్తే, దీపావళి పండుగను అంగరంగా వైభవంగా నిర్వహించుకోవచ్చు,
ఈ సందర్బంగా ప్రజలు ఆహ్లాదంగా, సురక్షితంగా దీపావళి పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.








