దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోండి : ఇంచార్జ్ సిపి సింధు శర్మ.

|| దృశ్యం న్యూస్ ||

దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికి ఇంచార్జ్ సిపి సింధు శర్మ శుభాకాంక్షలు తెలియజేశారు, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పండుగను మీ కుటుంబ సభ్యులతో కలిసి నిండుగా ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుకున్నారు.

దీపావళి సమయంలో అహంకారం, స్వార్థం, అసూయల వంటి చీకట్లు దూరం చేస్తూ, మీ మనస్సులో ఓ మంచి దీపం వెలిగించి పది మందికి వెలుతురును అందించేలా ఉండాలని,
పిల్లలు బాణసంచాలు కాల్చేటప్పుడు, కుటుంబ పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని,

శాంతి మరియు భద్రతలకు కష్టం కలగకుండా, అందరూ ఒకరికొకరు సహకరించుకొని ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది మధ్య స్నేహ పూర్వక సంబంధాలను పటిష్టంగా కొనసాగించేందుకు యత్నించాలని దీపావళి పండగ అందరికి శుభం కావాలని, మీ జీవితంలో సంతోషం వెల్లువెత్తాలని కోరుకుంటున్నాను అని ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment