|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, హోవార్డ్ పాఠశాల ఆధ్వర్యంలో 77వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం వేళ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం కలిసి ప్రభాత పేరిని నిర్వహించారు. జాతీయ స్వతంత్ర సమరయోధులు, మహానీయుల వేషధారణలో చిన్నారులు పురవీధుల గుండా సాగుతూ ప్రజలలో దేశభక్తి భావాన్ని మేల్కొలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేస్తూ ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని నింపారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కలిసి జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడంతో పాటు దేశానికి సేవ చేయాల్సిన బాధ్యతను గుర్తు చేశారు.
పాఠశాల ఉపాధ్యాయ బృందం కార్యక్రమాన్ని అత్యంత క్రమబద్ధంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్న తేజ మాట్లాడుతూ, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీఎస్ శశికళ, కరస్పాండెంట్ టీవీఆర్ మూర్తి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సమస్త ప్రజానీకానికి 77వ జాతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.








