ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నేటి నుండి ఒంటిపూట బడులు.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి సర్వే పూర్తయ్యే వరకూ పాఠశాలలు మధ్యాహ్నం వరకు మాత్రమే కొనసాగనున్నాయి, ఉదయం 9 నుండి ఒంటిగంట వరకు తరగతులు నిర్వహించి మధ్యాహ్న భోజనం తర్వాత ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సర్వేలో పాల్గొననున్నారు.

సర్వే కోసం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎస్జీటీలుగా విధులు నిర్వహించనున్నారు, విద్యార్థులు మధ్యాహ్నం తరగతులు పూర్తయ్యే వరకూ బడిలో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలో భాగంగా కీలక నిర్ణయమని అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment