|| దృశ్యం న్యూస్ ||
విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామమైన చిట్కుల్ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నీలం మధు ప్రత్యేక పూజలు నిర్వహించి, పల్లకి సేవలో పాల్గొన్నారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త తెలుగు సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

నీలం మధు మాట్లాడుతూ, ఉగాది పండుగలో పంచాంగ శ్రవణానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జ్యోతిషశాస్త్రం భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, పండితులు భవిష్య వాణి వివరించడం ద్వారా నూతన సంవత్సరానికి ముందస్తు అంచనా వేయవచ్చని చెప్పారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.








