నిజామాబాద్ స్పోర్ట్స్ ఛాంపియన్ – యోగాసనాలో బోధన్ శివలింగకు గోల్డ్ మెడల్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్ 2025 యోగాసన క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ పోటీల్లో బోధన్ పట్టణానికి చెందిన సింగారం శివలింగ జూనియర్ విభాగంలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు.

చిన్న వయసులోనే క్రమశిక్షణతో సాధన చేసి, యోగాసనాల్లో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శించడం శివలింగ విజయంలో ప్రధాన కారణమని కోచ్‌లు అభిప్రాయపడ్డారు.
స్థానిక క్రీడాభిమానులు, కుటుంబ సభ్యులు ఈ విజయాన్ని హర్షంతో స్వాగతించారు. బోధన్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన శివలింగకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment