|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో MGNREGS నిధుల ద్వారా రూ.40 లక్షల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 లక్షలు శివాలయం దగ్గర సీసీ ప్లాట్‌ఫాం & రోడ్డు అభివృద్ధికి రూ.15 లక్షలు, కూనీపూర్ క్యాంపులో డ్రైనేజ్ నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించారు.
ఈ అభివృద్ధి పనులను గ్రామ ప్రత్యేక అధికారి, మండల ఎంపీఓ మారుతి భూమి పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పిసిసి డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్ట్కార్ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో గ్రామానికి రూ.65 లక్షల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








