|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో చిన్ననాటి మిత్రులు కలిసి చదువుకున్న తోటి విద్యార్థి డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డిని ఘనంగా సన్మానించారు. 1997లో శ్రీనగర్ పాఠశాలలో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న రాజారెడ్డి ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకోవడం గ్రామానికి గర్వకారణమైంది. ఈ సందర్భంగా సురేందర్, సుబ్రహ్మణ్యం, సూర్య, అహ్మద్, మల్లేష్, శ్రీనివాస్, కిషోర్, శ్రీధర్, ఇందూర్ సాయిలు, సురేష్, మోహన్, అరవింద్ తదితర మిత్రులు పాల్గొన్నారు.
డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ, “మీతోటి మిత్రులతో కలిసి చదువుకోవడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. మీ సన్మానం నాకు ఎనలేని ఆనందం కలిగిస్తోంది” అని అన్నారు. ఈ సన్మానం గ్రామంలో స్నేహబంధాలను మరింత బలోపేతం చేసింది.








