|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వేలంపాట జరిగింది.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు వేలం పాటలో 35 వేల రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రాములు కుటుంబ సభ్యులకు లడ్డూను ఘనంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పట్టేపు రాములు ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రతి ఏడాది జరిగే ఈ లడ్డూ వేలంపాట గ్రామంలో విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సంవత్సరం లడ్డూ ధర రికార్డు స్థాయిలో ఉండడం గ్రామస్థులలో చర్చనీయాంశమైంది.








