శ్రీ రేణుక ఎల్లమ్మ మాత 31వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే యం.పద్మదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ పట్టణంలోని పసుపులేరు ఒడ్డున ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ 31వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం.పద్మదేవేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి,
రేణుక మాత ఆశీస్సులు మెదక్ జిల్లా ప్రజలపై ఎప్పుడూ ఉంటాయని, అందరిని సుభిక్షంగా ఉంచాలని మాతను కోరినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు మంగ రమేష్ గౌడ్, పద్మదేవేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, తాజా మాజీ కౌన్సిలర్లు మామిళ్ళ ఆంజనేయులు, ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, నాయకులు గడ్డమీది కృష్ణ గౌడ్, లింగారెడ్డి, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఉత్సవాలు, స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో వేడుకగా జరిగాయి. పెద్ద సంఖ్యలో స్థానికులు, ప్రాంతీయ నాయకులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు, ఇది మెదక్ పట్టణం లో మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment