దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొడపాక, సీతానగర్ గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. శుక్రవారం జరిగిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే, మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు.

పద్మదేవేందర్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు కలిసి అమ్మవారికి పూజలు చేశారు.
ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి గ్రామ మహిళలతో కలసి కోలాటం ఆడి శోభాయాత్రలో సందడి చేశారు. భక్తులతో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment