|| దృశ్యం న్యూస్ ||
మెదక్ మండలం కొంటూరు చెరువు వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి జాతరలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మహిళలతో కలిసి అమ్మవారికి ఓడిబియ్యం పోసి భక్తిభావంతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం. లావణ్య రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








