|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ గ్రామంలో ముత్యాల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు.
మంగళవారం జరిగిన ఈ ఉత్సవాల్లో పద్మా దేవేందర్ రెడ్డి మహిళలతో కలిసి పోచమ్మ తల్లికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ లు కురుమూర్తి గౌడ్, దానయ్య, లింగారెడ్డి, బద్రి, మల్లేశం, శ్రీనాథ్ రావు, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు వడ్ల కుబేర్, ప్రముఖ నాయకులు సాయిరెడ్డి, సొంగ దుర్గయ్య, ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్తలు నాగప్ప, దుర్గయ్య, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.








